: ఆగిన ఐఆర్సీటీసీ వెబ్ సైట్... రిజర్వేషన్లు బంద్!
ఇండియాలో రైల్వే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ సేవలందిస్తున్న ఐఆర్సీటీసీ వెబ్ సైట్ మొరాయించింది. ఈ ఉదయం టికెట్లు బుక్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వెబ్ సైట్ తెరచిన వారికి "సైట్ నిర్వహణ కారణంగా ఈ-టికెటింగ్ సేవలను అందించలేకపోతున్నాం. అంతరాయానికి చింతిస్తున్నాం" అన్న మెసేజ్ కనిపిస్తోంది. వాస్తవానికి ప్రతి రోజూ తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రారంభమయ్యే సమయంలో ఐఆర్సీటీసీ వెబ్ సైట్ కొంత మొరాయిస్తుందన్న సంగతి తెలిసిందే. అధునాతన సాంకేతికతను వెబ్ సైట్ కు జోడించడం ద్వారా బుకింగ్ విధానం వేగవంతం చేసేందుకు సైట్ నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, తిరిగి ఎప్పుడు సేవల పునరుద్ధరణ ఉంటుందన్న విషయాన్ని మాత్రం ఐఆర్సీటీసీ వెల్లడించలేదు.