: స్పైస్ జెట్ నుంచి 'హ్యాపీ న్యూ ఇయర్ సేల్' ఆఫర్
కొత్త సంవత్సరం సందర్భంగా విమానయాన సంస్థ స్పైస్ జెట్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. 'హ్యాపీ న్యూ ఇయర్' సేల్ పేరుతో ఆఫర్ ప్రకటించామని తెలిపింది. వచ్చే సంవత్సరం జనవరి 15 నుంచి ఏప్రిల్ 12వ తేదీలోపు ప్రయాణాలు చెయ్యాలనుకునే వారు ఈ డిస్కౌంట్ సేల్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ప్రయాణికులకు తెలిపింది. తమ దేశీయ విమాన సర్వీసుల్లో ఒకవైపు ప్రయాణ టిక్కెట్టు ప్రారంభ ధర అదనపు పన్నులతో కలిపి రూ.716గా నిర్ణయించామని తెలిపింది. ఈ నెల 31 నుంచి నాలుగు రోజుల పాటు ఈ ప్రత్యేక ఆఫర్లలో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పింది. బుక్ చేసుకున్న వారికి టిక్కెట్ రద్దు చేసుకునే సదుపాయం కూడా ఉందని, రిఫండ్ వర్తిస్తుందని వెల్లడించింది.