: యూఏఈ, ఖతర్ లో వలస కార్మికులకు శుభవార్త... 6 నెలల కాలపరిమితి ఎత్తివేత
యూఏఈ, ఖతర్ లలో వలస కార్మికులకు ఆ దేశాలు శుభవార్త అందించాయి. ఆయా దేశాలు, కంపెనీల్లో పనిచేస్తున్న ఉపాధి కార్మికులు పని నచ్చినా, నచ్చకున్నా కచ్చితంగా రెండు సంవత్సరాల పాటు పని చేయాల్సి ఉంది. ఒకవేళ పని చేయకుండా స్వదేశానికి తిరిగివస్తే మళ్లీ ఆరు నెలల పాటు ఆ దేశాలకు కార్మికులు వెళ్లే అవకాశం లేదు. ప్రస్తుతం ఈ గడువును తొలగించాలని యూఏఈలోని మినిస్టర్ ఆఫ్ లేబర్ కౌన్సిల్ నిర్ణయించింది. అటు ఖతర్ లోనూ ఈ నిబంధన ఎత్తివేశారు. జనవరి 1 నుంచి ఇది అమలులోకి రానుంది. ఉపాధి కోసం యూఏఈలోని అబుదాబి, అజ్మాన్, షార్జా, దుబాయ్, ఫుజారహ్, రసల్ ఖైమా, ఉమర్ అల్ క్వైన్, ఖతర్ లోని వివిధ ప్రాంతాల్లోని పలు కంపెనీల్లో పనికి కార్మికులు వెళుతుంటారు. తాజా నిర్ణయంతో వారికి ఊరట లభించినట్టయింది.