: ఇల్లినాయిస్, మిస్సోరీ, అలబామా, మిసిసిపి, టెన్నెస్సీ అతలాకుతలం... భారీ వరదలకు 41 మంది మృతి
అమెరికా వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఆపై ముంచెత్తిన వరదల కారణంగా 41 మంది మరణించగా, కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. పలు ఇళ్లు కుప్పకూలగా శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. దక్షిణ, మధ్య పశ్చిమ ప్రాంతాల్లో టోర్నడోలు రావడంతో, ఆపై భారీ వర్షాలతో పలు నగరాలు అతలాకుతలమయ్యాయి. ఇల్లినాయిస్ లో ఐదుగురు, సెంట్రల్ మిస్సోరీలో ఆరుగురు, అలబామాలో ఇద్దరు, మిసిసిపిలో 10 మంది టెన్నస్సీలో ఆరుగురు మరణించినట్టు అధికారులు వెల్లడించారు. డల్లాస్ శివార్లలో వచ్చిన టోర్నడోలో చిక్కుకుని 8 మంది మరణించారని, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు రెడ్ క్రాస్ విభాగం కృషి చేస్తున్నదని వివరించారు.