: అయుత మహా చండీయాగానికి స్వల్ప ఆటంకం!

101 హోమ గుండాలు... కిలోల కొద్దీ ఆవునెయ్యి, కర్పూరం, టన్నుల కొద్దీ సమిధలు అగ్నికి ఆహుతవుతున్న వేళ యాగశాల మొత్తం పొగచూరిపోయి రుత్వికులకు ఊపిరి ఆడక, అందరూ బయటకు పరుగులు తీయడంతో అయుత మహా చండీయాగానికి స్వల్ప ఆటంకం ఎదురైంది. ఆ వెంటనే నిర్వాహకులు, రుత్వికులను ఎవ్వరినీ యాగశాల బయటకు వెళ్లేందుకు అనుమతించ వద్దని పోలీసులను కోరడంతో కొంత గందరగోళ పరిస్థితి ఎదురైంది. ఊపిరాడని రుత్వికులు, యాగశాల చివరకు వచ్చి ఊపిరి పీల్చుకుని తిరిగి లోపలికి వెళ్లేందుకు వెనుకాడారు. దీంతో నిర్వాహకులు పదేపదే వారిని లోపలికి పిలవాల్సి వచ్చింది. పొగ మొత్తం బయటకు పోయేలా ఎగ్జాస్ట్ ఫ్యాన్లను అప్పటికప్పుడు ఏర్పాటు చేయడంతో పరిస్థితి సద్దుమణిగి యాగం తిరిగి మొదలైంది. దీనివల్ల యాగం ఓ అరగంట సేపు ఆగిపోయింది.

More Telugu News