: నీటిని క్షణాల్లో శుద్ధి చేసే విధానాన్ని రూపొందించిన అమెరికన్ సైంటిస్టులు


కలుషిత నీటిని క్షణాల్లో శుద్ధి చేసే సరికొత్త రసాయన సమ్మేళనాన్ని అమెరికన్ సైంటిస్టులు అభివృద్ధి చేశారు. యూఎస్ లోని కార్నెల్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ విల్ డిచ్ టెల్ నేతృత్వంలోని రీసెర్చర్ల టీం దీన్ని తయారు చేసింది. ఈ రసాయనంతో తయారు చేసిన గుళికలు నీటిలో వేస్తే, ఆ నీటిలోని కాలుష్యమంతా తొలగిపోతుందని, దీన్ని తిరిగి వినియోగించుకోవచ్చని, కంటికి కనిపించని హానికారకాలను ఇది నాశనం చేస్తుందని వివరించారు. సైక్లో డెక్స్ ట్రిన్ సాయంతో ఈ పునర్వినియోగ పాలిమర్ ను తయారు చేశామని, సంప్రదాయ కార్బన్ తో పోలిస్తే, ఇది 200 రెట్లు అధిక పనితీరును చూపుతోందని ఈ సందర్భంగా డిచ్ టెల్ వివరించారు. ఈ తాజా ఆవిష్కరణ గురించిన వివరాలు 'నేచర్' జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

  • Loading...

More Telugu News