: కేజ్రీపై రాబర్ట్ వాద్రా ఆగ్రహం... సరి-బేసి మొత్తం మాయేనని కామెంట్

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టనున్న ‘సరి-బేసి’ విధానంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సహా పలువురు ప్రముఖులు స్వాగత వచనాలే పలికారు. మొన్నటిదాకా ఎయిర్ పోర్టుల్లో తనిఖీలు లేని ప్రముఖుడి హోదాలో ఉండి, ప్రస్తుతం ఆ హోదా తొలగిపోయిన రాబార్ట్ వాద్రా మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ అల్లుడిగా రాబర్ట్ వాద్రా నిన్నటిదాకా ప్రముఖుడి హోదాలోనే ఉన్నారు. అయితే బీజేపీ సర్కారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన హోదా కాస్తా గాలికి ఎగిరిపోయింది. కొద్దిసేపటి క్రితం తన ఫేస్ బుక్ పేజీలో కేజ్రీ సరికొత్త నిర్ణయంపై వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. సరి-బేసి మంచిదే అయినా, మళ్లీ అందులో ప్రముఖులకు మినహాయింపులెందుకని ఆయన ప్రశ్నించారు. నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించేందుకే అమలు చేయాలని, అలా కాని పక్షంలో నిబంధనలకు అర్థమే లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కేజ్రీ సర్కారు నిర్ణయాలు మొత్తం మాయేనని కూడా వాద్రా అన్నారు.

More Telugu News