: దమ్ములేకే జగన్ వాకౌట్ చేశారు... అతనో అరాచక శక్తి: మంత్రి ప్రత్తిపాటి
వైకాపా అధినేత జగన్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ఓ అరాచక శక్తి అంటూ ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా జగన్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశాలపై మాట్లాడటం కూడా ఇందులో భాగమేనని అన్నారు. జగన్ కు ధన దాహం, అధికార దాహం తప్ప మరొకటి లేదని చెప్పారు. సభాపతి స్థానాన్ని కూడా గౌరవించే సంస్కారం జగన్ కు లేదని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రంపై చర్చించే దమ్ము లేకే... అసెంబ్లీ నుంచి జగన్ వాకౌట్ చేశారని ఎద్దేవా చేశారు. కాల్ మనీలో ఎక్కువ మంది వైకాపా నేతలే ఉన్నారని ఆరోపించారు.