: సీపీఐ 91వ వ్యవస్థాపక వార్షికోత్సవం
హైదరాబాద్ లోని సీపీఐ పార్టీ కార్యాలయం మగ్ధుం భవన్ లో ఆ పార్టీ 91వ వ్యవస్థాపక వార్షికోత్సవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్లకే అనుకూలమని విమర్శించారు. దేశంలో మతోన్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీల పునరేకీకరణ వల్లే ప్రజలకు లాభమని తెలిపారు.