: మల్లన్నకు చెర్రీ అత్తామామల అరుదైన కానుక... రూ.33 లక్షల బంగారు ధారా పాత్ర అందజేత
టాలీవుడ్ యువ హీరో రాంచరణ్ తేజ్ అత్తామామలు కామినేని శోభన (అపోలో హాస్పిటల్స్ ఎండీ) అనిల్ దంపతులు నిన్న శ్రీశైల మల్లన్నకు అరుదైన కానుకను అందజేశారు. నిన్న కర్నూలు జిల్లాలోని శ్రీశైల క్షేత్రానికి వెళ్లిన ఆ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి బహూకరించేందుకు ఆ దంపతులు దాదాపు రూ.33 లక్షలతో ప్రత్యేకంగా బంగారు ధారా పాత్రను తయారు చేయించారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం ఆ పాత్రను వారు ఆలయ జేఈఓ హరనాథరెడ్డికి అందజేశారు.