: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులంతా ఫిరాయింపుదారులే: రేవంత్ రెడ్డి
తెలంగాణ శాసనమండలికి స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. వారంతా ఫిరాయింపుదారులేనని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ బరితెగించి మరీ స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి 6 స్థానాలను ఏకగ్రీవం చేసుకుందన్నారు. మిగిలిన స్ధానాల్లో ఆ పార్టీని ఓడించి సీఎం కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీడియా సమావేశంలో కోరారు. అలాగే రాష్ట్రంలోని మంత్రుల వెనుక ఎన్నికల సంఘం షాడో టీంలను పెట్టాలన్నారు.