: గుణదల మేరీమాత చర్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

విజయవాడలోని గుణదల మేరీమాత చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదే సమయంలో మహిళలకు చంద్రన్న క్రిస్మస్ కానుకను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ అతిపెద్ద పండుగ అన్నారు. పేద ప్రజల ప్రతినిధిగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. పేదరిక నిర్మూలనే తమ లక్ష్యమని, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశామని తెలిపారు. సీఎంతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పలువురు టీడీపీ నేతలు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News