: చంద్రబాబు లిమిటెడ్ కంపెనీగా ప్రభుత్వం మారిపోయింది: శైలజానాథ్

ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ విమర్శించారు. తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేసిన అంగన్ వాడీలను తొలగించాలని ప్రభుత్వం జీవో విడుదల చేయడం దారుణమని అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఫ్రీ జోన్ అమలు చేయాలని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన చంద్రబాబు... ఇంతవరకు ఒక ఉద్యోగమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం మంచిది కాదని తెలిపారు.

More Telugu News