: ఏపీ శాసనసభలో జరిగిన వాస్తవ పుటేజ్ ను బయటపెట్టాలి: చెవిరెడ్డి

ఏపీ శాసనసభలో తమ పార్టీ నేతలున్న దృశ్యాలతో కూడిన వీడియోలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఖండించారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సాక్షాత్తూ సీఎం చంద్రబాబు సమక్షంలోనే వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ సభ్యులు అసభ్య పదజాలంతో దూషించారని చెప్పారు. వినేందుకు వీల్లేని భాషలో తిట్ల పురాణం లంకించుకున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ పచ్చి బూతులు తిడుతూ నీచంగా మాట్లాడినా ఆయనపై కనీస చర్యలు తీసుకోలేదన్నారు. తాము మైక్ అడిగితే స్పీకర్ ఇవ్వరని, కానీ టీడీపీ ఎమ్మెల్యేలు తిడుతుంటే మైక్ కట్ చేయడం లేదని మండిపడ్డారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారన్న నమ్మకంతోనే కోడెలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, కానీ అలా వ్యవహరించడం లేదు కాబట్టే అవిశ్వాసం పెట్టామని చెవిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు మాట్లాడిన పుటేజ్ ను, అసలు సభలో జరిగిన వాస్తవ పుటేజ్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

More Telugu News