: చండీయాగానికి హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్

మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో జరుగుతున్న అయుత చండీయాగానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ హాజరయ్యారు. యాగశాల వద్ద ఆయనకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు స్వాగతం పలికారు. మరోవైపు వైభవోపేతంగా జరుగుతున్న యాగం రెండో రోజుకు చేరింది. ఇవాళ ప్రత్యేకంగా కేసీఆర్ దంపతులు గులాబీ రంగు దుస్తులు ధరించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రుత్విక్కులు కూడా అదే రంగు దుస్తుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాగంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

More Telugu News