: టీడీపీ సభ్యులు రెచ్చగొట్టారు: ఎమ్మెల్యే రోజా
అసెంబ్లీలో టీడీపీ సభ్యులు రెచ్చగొట్టడం వల్లే తాను ఘాటు వ్యాఖ్యలు చేశానని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో వైఎస్సార్సీపీ నేతలు, ముఖ్యంగా రోజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రజలకు తెలియజేసేందుకుగాను సంబంధిత వీడియో క్లిప్స్ ను ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఈ రోజు మీడియాకు విడుదల చేశారు. ఈ విషయమై ఒక ఛానల్ తో రోజా మాట్లాడుతూ, అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. అధికార పక్ష సభ్యుల వీడియో ఫుటేజ్ కూడా విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు మహిళలపై వివక్ష చూపుతున్నారని రోజా ఆరోపించారు.