: కేజ్రీకి కేపీఎస్ గిల్ దన్ను!... జైట్లీపై ఢిల్లీ సీఎంకు ఫిర్యాదు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ల మధ్య నెలకొన్న వివాదం మరింత పెద్దది కానుంది. ఇప్పటికే బీజేపీ మాజీ నేత, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ... అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా కేజ్రీకి మద్దతు పలకడమే కాక జైట్లీ పరువు నష్టం దావాపై జరగనున్న విచారణలో కేజ్రీ తరఫున వాదించనున్నారు. ఈ విచారణలో భాగంగా తాను జైట్లీని క్రాస్ ఎగ్జామిన్ చేస్తానని కూడా జెఠ్మలానీ ప్రకటించారు. తాజాగా దేశంలోనే టాప్ కాప్ గా పేరుగాంచిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేపీఎస్ గిల్, కేజ్రీకి దన్నుగా నిలిచారు. గతంలో హాకీ ఇండియా సలహా మండలి సభ్యుడి హోదాలో ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ తన కూతురును ఆ సంస్థ న్యాయవాదిగా నియమించుకున్నారని కేపీఎస్ గిల్ ఆరోపించారు. అంతేకాక పెద్ద ఎత్తున సంస్థ నిధులను ఆమెకు ఫీజులుగా చెల్లించారని ఆరోపించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయన జైట్లీపై ఢిల్లీ సీఎం కార్యాలయానికి ఏకంగా ఫిర్యాదు చేశారు. మరి ఈ వ్యవహారం ఎంతదాకా వెళుతుందో చూడాలి.

More Telugu News