: స్పీకర్ పై అవిశ్వాస తీర్మాన నోటీసివ్వడం సరికాదు!: ఏపీ మంత్రి కామినేని
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్సార్సీపీ నేత రోజా వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, శాసనసభలో రోజా మాట్లాడిన తీరుపై సభ కోరిక మేరకు శిక్ష విధించిన స్పీకర్ పై అవిశ్వాస తీర్మాన నోటీసివ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. రోజాను వైఎస్సార్సీపీ వెనుకేసుకు రావడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని ఆయన తెలిపారు. తప్పు చేసిన వారే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకోవడం దారుణమని ఆయన విమర్శించారు.