: నా పేరు వింటేనే మోదీ రక్తం మరుగుతోందట!: అసెంబ్లీ సాక్షిగా కేజ్రీవాల్ కామెంట్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ సాక్షిగా నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కార్యాలయంలో సీబీఐ సోదాలు, డీడీసీఏ కుంభకోణంపై ఆరోపణలతో తనపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువునష్టం దావాల నేపథ్యంలో నిన్న ఢిల్లీ అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపరచిన కేజ్రీవాల్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి జైట్లీని కాపాడేందుకే తన కార్యాలయంలో సీబీఐ సోదాలు జరిగాయని ఆయన ఆరోపించారు. డీడీసీఏ కుంభకోణం నుంచి జైట్లీ కడిగిన ముత్యంలా బయటపడతారని వ్యాఖ్యానించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా కేజ్రీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన పేరు వింటేనే మోదీ రక్తం మరిగిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత తనకు చెప్పారని కూడా కేజ్రీ పేర్కొన్నారు. దమ్ముంటే మోదీ తన మంత్రివర్గం నుంచి జైట్లీని తప్పించి విచారణ చేయించాలని కూడా ఆయన సవాల్ చేశారు.

More Telugu News