: కేసీఆర్ చండీయాగానికి ఈ నెల 27న హాజరుకానున్న చంద్రబాబు

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ సొంత వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌస్)లో నేటి ఉదయం 8.10 గంటలకు ప్రారంభం కానున్న ఈ యాగం ఈ నెల 27 దాకా నిర్విఘ్నంగా కొనసాగనుంది. యాగానికి రేపు (ఈ నెల 24న) బీజేపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ హాజరవుతారు. ఈ నెల 25న మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, 26న తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అయుత చండీయాగానికి హాజరవుతారు. ఇక టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27న (యాగం చివరి రోజు)న యాగ క్షేత్రానికి రానున్నారు. ఈ మేరకు చంద్రబాబు నుంచి కేసీఆర్ కు సమాచారం అందినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఈ నెల 27ననే కేసీఆర్ యాగానికి హాజరు కానున్నారు.

More Telugu News