: సంజయ్ లీలా భన్సాలీకి మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఇవ్వాలి: కాంగ్రెస్ నేత
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఇవ్వాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత నితీష్ ఎన్ రాణె అన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాసిన ఆయన, భన్సాలీ తెరకెక్కించిన బాజీరావ్ మస్తానీ అద్భుతమైన విజయం సాధించిందని అన్నారు. మరాఠా యోధుడు పీష్వా బాజీరావు పేరు ఇంటింటా మార్మోగుతోందని ఆయన తెలిపారు. అందుకే భన్సాలీని రాష్ట్ర భూషణ్ అవార్డుతో సత్కరించాలని సూచించారు. మరాఠా చరిత్రను వక్రీకరించిన బాబాసాహెబ్ పురందరేని మహారాష్ట్ర భూషణ్ తో బీజేపీ ప్రభుత్వం సత్కరించినప్పుడు, బాజీరావ్ చరిత్రపై సంచలనాత్మక చిత్రం తీసిన సంజయ్ లీలా భన్సాలీని ఎందుకు సత్కరించకూడదని ఆయన లేఖలో ప్రశ్నించారు. కాగా, ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని, సినిమాను నిలిపేయాలంటూ బీజేపీ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.