: ఢిల్లీ విమాన ప్రమాదంలో 10 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది మృతి... మోదీ దిగ్భ్రాంతి

ఢిల్లీలోని ద్వారకా సమీపంలో ఈ ఉదయం సూపర్ కింగ్ విమానం కూలిన ఘటనలో అందరూ చనిపోయారు. అందులో ఉన్న ఏడుగురు బీఎస్ఎఫ్ జవాన్లు, ముగ్గురు సాంకేతిక నిపుణులు మరణించినట్టు ధ్రువీకరణ అయింది. పౌరవిమానయాన శాఖ మృతుల సంఖ్యను ధ్రువీకరించింది. సాంకేతిక నిపుణులతో రాంచీ వెళుతుండగా విమానం టేకాప్ సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ఇవాళ ఢాకాలో జరగాల్సిన భారత్- బంగ్లాదేశ్ డీజీ స్థాయి సమావేశం రద్దైంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

More Telugu News