: 25 కార్పొరేట్ శక్తులు ఏపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి: వైకాపా

తెలుగుదేశం ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాన్ని 25 కార్పొరేట్ శక్తులు నడిపిస్తున్నాయని వైకాపా ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఉన్నత విద్యను ప్రైవేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి ప్రభుత్వం యత్నిస్తోందని అన్నారు. ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లు ద్వారా ప్రభుత్వ యూనివర్శిటీలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును వైకాపా వ్యతిరేకిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని 20 గవర్నమెంట్ యూనిర్శిటీలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని మండిపడ్డారు.

More Telugu News