: వైసీఎల్పీ కీలక భేటీ నేడు... స్పీకర్ పై అవిశ్వాసంపై తుది నిర్ణయం

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం వైసీపీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. నేటి మధ్యాహ్నం వైసీఎల్పీ కార్యాలయంలో జరగనున్న ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్, స్పీకర్ కోడెల శివప్రసాద్ పై ప్రతిపాదించనున్న అవిశ్వాస తీర్మానం తదితరాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే రోజా సస్పెన్షన్ పై ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైసీపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. అదే సమయంలో నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఈ క్రమంలో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు ప్రతిపాదించాలన్న అంశంపై కూడా ఆ పార్టీ నేడు నిర్ణయం తీసుకోనుంది. ఇక రోజా సస్పెన్షన్ పై కోర్టు గడప తొక్కనున్నట్లు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్ననే ప్రకటించారు. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపైనా నేటి భేటీలో వైసీఎల్పీ చర్చించనుంది.

More Telugu News