: జైట్లీ కేసు వేసినంత మాత్రాన భయపడం: కేజ్రీవాల్
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కేసు వేసినంతమాత్రాన భయపడమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అరుణ్ జైట్లీ, కేజ్రీవాల్ మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. కేజ్రీవాల్ పై జైట్లీ ట్వీట్లతో విరుచుకుపడగా, తాజాగా కేజ్రీవాల్ ట్వీట్లతో రిటార్ట్ ఇచ్చారు. కేసులకు భయపడమని, అవినీతిపై పోరాటం ఆపమని చెప్పారు. పరువు నష్టం దావా వేసినంత మాత్రాన అవినీతిపై పోరాటంలో రాజీపడమని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్ధానంలో కేజ్రీవాల్, అతని సహచరులపై అరుణ్ జైట్లీ 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.