: ఆటో టైరు పేలడంతో నలుగురు అన్నదమ్ముల దుర్మరణం!
ఆటో టైరు పేలడంతో నలుగురు అన్నదమ్ములు దుర్మరణం చెందిన సంఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది.కావేరి పట్టణానికి చెందిన ఈ నలుగురు అన్నదమ్ములు పండ్ల వ్యాపారస్థులు. వారందరూ ఆటోలో వెళ్తుండగా దాని టైరు పేలడంతో వాహనం అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న గొయ్యిలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, నలుగురు అన్నదమ్ముల్లో ఒకరు ఆటో నడుపు తున్నారని, ఈ సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.