: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని డీఎస్ పిలుపు

రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ నేత డి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం అపారంగా పెరిగిందని చెప్పారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి కేఎం ప్రతాప్ టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా డీఎస్ మాట్లాడారు. సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం ముందంజలో ఉందని, సీఎం పర్యవేక్షణలో ఐడీహెచ్ కాలనీని బ్రహ్మాండంగా నిర్మించారని ప్రశంసించారు. రాష్ట్రంలోని పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ కట్టించి ఇస్తామని డీఎస్ ఉద్ఘాటించారు. టీఆర్ఎస్ పార్టీని ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్న డీఎస్, సంక్షేమ ఫలాలు అందరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

More Telugu News