: శివరామకృష్ణన్ కమిటీ గొప్పదా? లేక మంత్రి నారాయణ కమిటీ గొప్పదా?: కేవీపీ
నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టకండని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆగ్రహంగా అన్నారు. ఇంతపెద్ద విస్తీర్ణంలో రాజధాని అవసరమా? అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఇంత పెద్ద రాజధాని ప్రతిపాదన ఎక్కడా లేదని... దీనికి సంతోషించాలా? లేక బాధ పడాలా? అనే విషయం కూడా అర్థం కావడం లేదని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ గొప్పదా? లేక మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ గొప్పదా? అని ప్రశ్నించారు. శివరామకృష్ణన్ కమిటీలో విద్యార్హతలు, నైపుణ్యం కలిగిన సభ్యులు ఉన్నారని... నారాయణ కమిటీలో ఉన్న వ్యాపారవేత్తలకు ఉన్న అవగాహన ఎంత? అని నిలదీశారు. అమరావతిలో వరద ప్రాంతంగా ఉన్న 15 వేల ఎకరాల భూములకు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని చెప్పారు.