: కేసీఆర్ చండీయాగానికి హాజరవుతా!... కేంద్ర మంత్రి వెంకయ్య ప్రకటన


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగానికి హాజరు కానున్న ప్రముఖుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాగానికి హాజరవుతున్నట్లు ప్రకటించారు. ఇక టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా సతీసమేతంగా చండీయాగానికి హాజరుకానున్నట్లు సమాచారం. తాజాగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా చండీయాగానికి హాజరుకానున్నారు. ఈ మేరకు నిన్న హైదరాబాదులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేసీఆర్ యాగానికి తానూ హాజరుకానున్నట్లు వెంకయ్య ప్రకటించారు. విశ్వశాంతి, లోక కల్యాణం కోసం కేసీఆర్ చేపడుతున్న యాగాన్ని స్వాగతిస్తున్నానని కూడా వెంకయ్య పేర్కొన్నారు. ఈ నెల 24న యాగానికి హాజరు కానున్నట్లు ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News