: హిల్లరీ క్లింటన్ అబద్ధాల కోరు: డొనాల్డ్ ట్రంప్

రిపబ్లికన్ల తరపున అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. హిల్లరీ క్లింటన్ అబద్ధాలకోరని ఆయన వ్యాఖ్యానించారు. ఐఎస్ఐఎస్ కు ఉత్తమ రిక్రూడర్ గా ట్రంప్ వ్యవహరిస్తున్నారని హిల్లరీ చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని విమర్శించారు. ఎన్బీసీ నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఓ విమర్శ చేసే ముందు కనీస ఆధారాలు ఉండాలన్న విషయాన్ని ఆమె మరచిపోయారని ట్రంప్ అన్నారు. "ఆమె ఓ అబద్ధాల కోరని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆమె కేవలం గాలి ఆరోపణలు చేస్తోంది" అన్నారు. కాగా, కాలిఫోర్నియాలో ఉగ్రవాదుల దాడి అనంతరం, ముస్లింలందరినీ అమెరికాలో కాలు మోపకుండా నిషేధం విధించాలని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News