: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్?... ఇటుకలను చేరవేస్తున్న వీహెచ్ పీ

అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసిన ప్రాంతంలో రామ మందిరం నిర్మాణానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు పచ్చజెండా ఊపిందా? అంటే, అవుననే అంటున్నాయి విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) వర్గాలు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టే, రామ మందిరం నిర్మాణానికి అవసరమైన ఇటుకలను అయోధ్యకు చేరవేసే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆ సంస్థ చెబుతోంది. నిన్న రెండు లారీ లోడుల ఇటుకలు అయోధ్యలోని రామ్ సేవక్ పురం చేరుకున్నాయి. వీటికి రాం జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రామ మందిరం నిర్మాణానికి అనుమతి వచ్చిన నేపథ్యంలోనే ఇటుకలను తరలిస్తున్నామని వీహెచ్ పీ ప్రతినిధి శరత్ శర్మ బాహాటంగానే ప్రకటించారు. ఇకపై విడతల వారీగా ఇటుకల తరలింపు కొనసాగుతుందని కూడా ఆయన ప్రకటించారు.

More Telugu News