: రంగనాథ్ కు పరిశ్రమలో తొలి వివాదం..చివరి వివాదం అదే!

అన్ని దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ, సీనియర్ నటుడు రంగనాథ్ కు చిత్ర పరిశ్రమలో ఎవరితోనూ విభేదాలు లేవు. కాకపోతే, ఒకసారి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో మాత్రం ఆయన వాగ్యుద్ధానికి దిగారు. రాజమౌళి దర్శకత్వంలోని శాంతినివాసం టీవీ సీరియల్ లో ఒక ఎక్స్ ప్రెషన్ విషయంలో ఈ వివాదం జరిగింది. రంగనాథ్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ని అలా కాకుండా మరో విధంగా ఇవ్వాలని రాజమౌళి సూచించడం, ‘కాదు.. ఆ ఎక్స్ ప్రెషన్ కరెక్టే’ అని రంగనాథ్ అన్నారు. దీంతో రాజమౌళికి కోపం వచ్చి నెక్స్ట్ సీన్ చేద్దామనడం.. రంగనాథ్ కు కోపం వచ్చి ఇంటికి వెళ్లిపోవడం జరిగాయి. ఆ మర్నాడు మామూలుగానే ఇద్దరు కలిసి షూటింగ్ లో పనిచేశారు. కాగా, రాజమౌళికి మంచి భవిష్యత్తు ఉందని, వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోమని ఆ సీరియల్ హిట్ తర్వాత ఆయనతో రంగనాథ్ అన్నారు.

More Telugu News