: మధ్యాహ్నం 2 గంటలకు జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చిన రాష్ట్రపతి
శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాదు, బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ కు వచ్చిన ప్రణబ్ ముఖర్జీని ఈ మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలవనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారైందని వైకాపా వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి వచ్చిన వేళ, మర్యాద పూర్వకంగానే కలవనున్నామని వారు తెలియజేసినప్పటికీ, అసెంబ్లీలో రోజా సస్పెన్షన్ వ్యవహారం, కాల్ మనీ అంశాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జగన్ తో పాటు పలువురు వైకాపా నేతలు సైతం ప్రణబ్ ను కలిసేందుకు వెళ్లనున్నారు.