: వందలాది బైక్ లతో అమరావతికి కదిలిన 'డిక్టేటర్'... ఆడియో వేడుక నేడే!

టాలీవుడ్ హీరో, తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన 'డిక్టేటర్' చిత్రం ఆడియో విడుదల వేడుక నేడు అమరావతిలో జరగనుండగా, ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వందలాది బైకులతో అభిమానులు హైదరాబాద్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఎల్వీ ప్రసాద్ ల్యాబ్స్ నుంచి అమరావతికి ర్యాలీ కదలగా, బాలకృష్ణ ర్యాలీని ప్రారంభించి, తాను కూడా అదే ర్యాలీలో అమరావతికి పయనమయ్యారు. ఆయన వెంట చిత్ర బృందం కూడా బైకులపైనే కదిలింది. బాలయ్య 99వ చిత్రం కాబట్టి 99 బైకులతో ర్యాలీ అని చెప్పినప్పటికీ, అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ అమరావతిలోని డిక్టేటర్ ఆడియో వేడుక వేదికకు సాయంత్రం 4 గంటలకు చేరుతుందని అంచనా.

More Telugu News