: కేజ్రీవాల్... ఆ అధికారి ఎవరో చెబితే చర్యలు తీసుకుంటాం: సీబీఐ ఆఫర్!

తన దారిలోకి రాని పార్టీలపై బీజేపీ సర్కారు సీబీఐని ప్రయోగిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను సీబీఐ ఖండించింది. ఓ సీబీఐ అధికారే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించినట్టు కేజ్రీ వ్యాఖ్యానించగా, ఆ అధికారి ఎవరో చెబితే చర్యలు తీసుకుంటామని సీబీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ఓ వర్గం మీడియాలో మాత్రమే ఇటువంటి వార్తలు ప్రచురితమవుతున్నాయని వెల్లడించింది. సీబీఐ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని, ఆ వ్యక్తి (కేజ్రీవాల్), కేంద్రం నుంచి ఆదేశాలు అందాయని చెప్పిన అధికారి ఎవరో తక్షణం బయటపెట్టాలని డిమాండ్ చేసింది.

More Telugu News