: మా ఆటగాళ్లను సంప్రదించిన ఆ బుకీ కోసం విచారణ చేస్తున్నాం: లంక క్రీడా మంత్రి

ఈ ఏడాది అక్టోబర్ లో వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగిన గాలె టెస్టును ఫిక్స్ చేయాలని తమను ఓ బుకీ సంప్రదించాడని లంక వికెట్ కీపర్ కుశాల్ పెరీరా, బౌలర్ హెరాత్ లు అధికారులకు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆ బుకీ కోసం విచారణ చేస్తున్నట్టు లంక క్రీడా శాఖ మంత్రి దయసిరి జయశేఖర్ తెలిపారు. ఆ బుక్ మేకర్ 70వేల డాలర్లను ఇచ్చేందుకు ఆశ చూపాడని, విండీస్ విజయం సాధించేలా చూడాలని కోరినట్టు వివరించారు. కచ్చితంగా శ్రీలంక గెలిచే ఆ మ్యాచ్ తక్కువ స్కోరుకే ఆలౌట్ కావాలని వారు కోరుకున్నారని చెప్పారు. ఒకవేళ అదే జరిగి విండీస్ నెగ్గితే వారికి భారీ స్థాయిలో డబ్బు చేకూరేదని మంత్రి పేర్కొన్నారు. అయితే ఆ విషయాన్ని వారిద్దరూ అవినీతి వ్యతిరేక అధికారులకు చేరవేశారని అన్నారు. అయితే నాటి ఆ మ్యాచ్ లో లంక ఇన్నింగ్స్, ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

More Telugu News