: నాపై కేసులు అక్రమం... రోజాపై సస్పెన్షన్ అన్యాయం: గిడ్డి ఈశ్వరి
అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు తల నరుకుతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కేసు ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆమె మాట్లాడుతూ, తనపై పెట్టిన కేసులు అక్రమమని అన్నారు. తమ ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించడం కూడా చాలా అన్యాయమని చెప్పారు. ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు లేదని... అయినప్పటికీ స్పీకర్ అన్యాయపూరిత నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రోజా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని... ఆమెకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.