: గాయపడ్డ రోజాకు జగన్ పరామర్శ... నిమ్స్ కు తరలింపు

మార్షల్స్ తో వాగ్వాదం, మహిళా పోలీసులతో తోపులాట నేపథ్యంలో కిందపడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. అంతేకాక తీవ్ర వాగ్వాదం నేపథ్యంలో ఆమె షుగర్ లెవెల్స్ పడిపోయాయి. ఈ క్రమంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న సమయంలో పోలీస్ వాహనంలోనే ఆమె సొమ్మసిల్లిపడిపోయారు. ఓ వైపు సభ జరుగుతుండగానే సభ వెలుపల ఆసెంబ్లీ ఆవరణలో పోలీసులతో రోజా వాగ్వాదం, అరెస్ట్ తో అక్కడ కలకలం రేగింది. విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలివెళ్లారు. పోలీస్ స్టేషన్ లోనే రోజాను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రోజాను పోలీసులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

More Telugu News