: తప్పు చేశానని నిరూపిస్తే...వెళ్లి రాజశేఖర రెడ్డిని కలుస్తా: గద్దె రామ్మోహన్

నిందితులతో భోజనం చేస్తున్న ఫోటోలను చూపించి తనకు, వారికి సంబంధం ఉందని ఆరోపించడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. శాసనసభలో కాల్ మనీపై చర్చ జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తానెప్పుడూ ఒంటరిగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోదరుడితో విందు వినోదాలు జరపలేదని అన్నారు. ఒకవేళ తాను తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సైతం సిద్ధమని తెలిపారు. అంతేకాదని, ఈ లోకం నుంచి వెళ్లిపోవడానికి కూడా వెనుకాడనని అన్నారు. పైనున్న రాజశేఖరరెడ్డి దగ్గరకు నేరుగా వెళ్లి, 'మీ అబ్బాయి లేని పోని ఆరోపణలతో వేధించాడ'ని చెబుతానని ఆయన అన్నారు.

More Telugu News