: డివిలియర్స్ రికార్డు బ్రేక్ చేసిన మెక్ కల్లమ్

సౌతాఫ్రికా వన్డే కెప్టెన్ ఏబీ డివిలియర్స్ రికార్డును న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ బద్దలు చేశాడు. టెస్టు క్రికెట్ లో అరంగేట్రం చేసిన దగ్గర్నుంచి వరుసగా అత్యధిక (98) మ్యాచ్ లు ఆడిన వ్యక్తిగా డివిలియర్స్ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో హమిల్టన్ లో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ టెస్టు క్రికెట్ లో అరంగేట్రం చేసిన నాటి నుంచి అత్యధిక టెస్టు (99) మ్యాచ్ లు ఆడిన వ్యక్తిగా రికార్డు పుటలకెక్కాడు. కాగా, నేటి నుంచి ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్, శ్రీలంక జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

More Telugu News