: రేపు కోర్టుకు వెళుతున్నా... ఆపై ఏం జరుగుతుందో చూద్దాం: సోనియా గాంధీ

సుమారు రూ. 5 వేల కోట్ల అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను అప్పనంగా కొట్టేశారన్న అభియోగాలపై రేపు కోర్టుకు హాజరు కావాల్సిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఈ కేసుపై స్పందించారు. తాను రేపు పాటియాలా కోర్టుకు హాజరు కానున్నానని ఆమె స్పష్టం చేశారు. తమకు భారత న్యాయస్థానాలపై నమ్మకముందని, కోర్టు ఆదేశాల మేరకు సహజంగానే తాను వెళ్లితీరుతానని, ఆపై ఏం జరుగుతుందో చూద్దామని కొద్ది సేపటి క్రితం తనను కలిసిన మీడియాతో ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి 2012లో వేసిన కేసు మేరకు ట్రయల్ కోర్టు సోనియా, రాహుల్ లకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News