: వేడెక్కిన ఏపీ అసెంబ్లీ...చంద్రబాబు ప్రకటనను అడ్డుకుంటున్న ప్రతిపక్ష సభ్యులు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేడెక్కింది. కాల్ మనీ వ్యవహారం ఏపీ అసెంబ్లీని పట్టి కుదిపేస్తోంది. అధికార పార్టీ చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం కాల్ మనీపై చర్చ ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటన చేస్తున్నప్పుడు 'సీఎం డౌన్ డౌన్' అంటూ వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో హుందాగా వ్యవహరించాలని ఆయన తెలిపారు. ఈ వ్యవహార శైలి సరికాదని హితవు పలికారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రకటన చేస్తుంటే ప్రతిపక్షం ఆందోళన చేయడం ఎక్కడైనా జరుగుతుందా? అని ఆయన మండిపడ్డారు. దీంతో ప్రతిపక్ష పార్టీ సభ్యులు నినాదాల హోరు పెంచారు.

More Telugu News