: సకుటుంబ సపరివారంగా దయచేయండి... ఉద్యోగులకు ముఖేశ్ అంబానీ దంపతుల ఆహ్వానం
తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీల నుంచి ఆహ్వానం వెళ్లింది. ఈ నెల 27న ముంబైలో జరిగే 'ఆర్ఐఎల్ జియో' ప్రారంభోత్సవ కార్యక్రమానికి సకుటుంబ సపరివారంగా రావాలని వారు కోరారు. ఆ మరుసటి రోజున రిలయన్స్ సంస్థల వ్యవస్థాపకులు దివంగత దీరూభాయ్ అంబానీ జన్మదినం కానుండడంతో ఆనాటి వేడుక మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. షారూక్ ఖాన్, ఏఆర్ రెహమాన్ తదితరుల ప్రదర్శనలు ఉంటాయని, మీరు తప్పక రావాలని ఆయన కోరారు. కాగా, ఈ కార్యక్రమాన్ని లైవ్ వెబ్ కాస్ట్ ద్వారా 1000 ప్రాంతాల్లోని మొబైల్ వినియోగదారులు తిలకించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రిలయన్స్ వెల్లడించింది.