: గాంధీ ఆసుపత్రిలో నర్సుల డ్యాన్సులు... రోగుల ఇబ్బందులు!
క్రిస్మస్ వేడుకలంటూ, ఆ నర్సులు చేసిన పని రాత్రంతా రోగులకు నిద్రలేకుండా చేసింది. డీజే సౌండ్లతో తెల్లవారుఝామువరకూ పాటలు నృత్యాలతో నర్సులు ఆనందంగా ఆడి పాడగా, తమ అవసరాలు తీర్చేవారులేక ఇబ్బందులు పడ్డామని రోగులు వాపోయారు. ఈ ఘటన గత రాత్రి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో జరిగింది. ఇక్కడ పని చేస్తున్న నర్సులు అర్ధరాత్రి 12 గంటల నుంచి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ముందే నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆపై 8వ అంతస్తులో డీజే సౌండు పెట్టుకుని హోరెత్తించారు. డ్యాన్సులు చేశారు. దీనిపై మండిపడ్డ రోగుల బంధువులు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆర్ఎంఓ పట్టించుకోలేదని ఆరోపించారు.