: మోదీతో గూగుల్ సీఈవో పిచాయ్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సమావేశమయ్యారు. భారత పర్యటనలో ఉన్న పిచాయ్ ఢిల్లీలోని ఎన్ఆర్ సీసీ కళాశాల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న అనంతరం ప్రధాని నివాసానికి వెళ్లారు. ఈ సమావేశం సందర్భంగా ప్రధాని, పిచాయ్ మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధాని మోదీ 'మేకిన్ ఇండియా' గురించి పిచాయ్ కు వివరించగా, గూగుల్ సంస్థ భారత్ లో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి పిచాయ్, ప్రధానికి వివరించారు. వీరి సమావేశం కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తి పెంచింది.

More Telugu News