: విజయవాడలో ఎమ్మెల్యే రోజా ఫ్లెక్సీ దహనం

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఫ్లెక్సీని విజయవాడలో టీడీపీ మహిళా విభాగం దగ్ధం చేసింది. ఏపీ సీఎం చంద్రబాబుపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే ఇలా చేసినట్టు కృష్ణాజిల్లా తెలుగు మహిళా సంఘం అధ్యక్షురాలు ఆచంట సునీత తెలిపారు. రాజకీయ భవిష్యత్తునిచ్చిన చంద్రబాబునే విమర్శించే స్థాయి ఆమెకు లేదని మండిపడ్డారు. రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆమె చేసిన వ్యాఖ్యలు సాటి మహిళలు అసహ్యించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

More Telugu News