: ఇక ఫేస్ బుక్ ఖాతాలో క్లిక్ చేస్తే క్యాబ్ ఇంటికొచ్చేస్తుంది!

రవాణా రంగంలోకి ప్రవేశిస్తూ, సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్, క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ తో ఓ డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఫేస్ బుక్ వినియోగించే వారు క్యాబ్ ను తమ ఖాతా నుంచి బుక్ చేసుకునే వీలు దగ్గరవుతుంది. క్యాబ్ కావాల్సిన వారు ఉబెర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే అవసరం లేకుండా, ఫేస్ బుక్ పేజీ నుంచి బుక్ చేసుకోవచ్చని, తొలిసారి ఈ సదుపాయం వినియోగించుకునే వారికి ఉచిత అవకాశం అందిస్తున్నామని సంస్థ పేర్కొంది. ప్రస్తుతానికి అమెరికాలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని, త్వరలోనే ఉబెర్ సేవలందిస్తున్న అన్ని దేశాల్లోను క్యాబ్ బుకింగ్ ను మరింత ఈజీ చేసేలా తమ సేవలను విస్తరిస్తామని ఫేస్ బుక్ వెల్లడించింది. ఉబెర్ తో పాటు ఇతర ప్రముఖ క్యాబ్ సంస్థలతోనూ ఇదే విధమైన డీల్స్ కుదుర్చుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది.

More Telugu News