: యూపీలో ఆల్ కాయిదా ఉగ్రవాది... అరెస్ట్ చేసిన పోలీసులు
దేశంలోనే కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ఉగ్రవాదులు చొరబడ్డారు. యూపీలోని సంబర్ జిల్లాలో నేటి ఉదయం ఆల్ కాయిదా ఉగ్రవాదిగా భావిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో దాడులకు పథకం పన్నిన ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో సోదాలు ముమ్మరం చేసిన పోలీసులు రెండు రోజుల క్రితం ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నేడు సంబల్ జిల్లాలో అరెస్టైన ఉగ్రవాది కూడా రెండు రోజుల క్రితం అరెస్టైన వారితో కలిసే భారత్ లోకి చొరబడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడిని నేడో, రేపో ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.