: సరికొత్త మైలు రాయిని అధిగమించాం: షార్ డైరెక్టర్ కున్హి కృష్ణన్
శ్రీహరి కోట నుంచి 50 ప్రయోగాలు పూర్తి చేసుకుని భారత అంతరిక్ష పరిశోధనా రంగం చరిత్రలో సరికొత్త మైలు రాయిని అధిగమించామని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ కున్హి కృష్ణన్ పేర్కొన్నారు. ఈ ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-29 ప్రయోగం అనంతరం ఆయన మాట్లాడారు. విజయ పథంలో పీఎస్ఎల్వీ దూసుకెళ్తోందని, పీఎస్ఎల్వీ వరుసగా 31వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందని అన్నారు. సింగపూర్ దేశం 50వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం సహా, భారత్-సింగపూర్ దేశాల మైత్రికి యాభై ఏళ్లు పూర్తయిన వేళ ఆ దేశానికి చెందిన 6 ఉప గ్రహాల్ని ప్రయోగించడం కాకతాళీయమని కున్హి కృష్ణన్ పేర్కొన్నారు.