: యూజర్ల కోపాన్ని ‘కర్సర్’ మూవ్ మెంట్స్ చెప్పేస్తాయి!


కంప్యూటర్ పై పని చేసేటప్పుడు.. ఒకవేళ మనం కోపంగా లేదా చికాకుగా ఉంటే కనుక, కర్సర్ మూవ్ మెంట్లలో ఆ విషయం తెలిసిపోతుంది. ఈ విషయం పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆయా సందర్భాలలో కంప్యూటర్ మౌస్ ను ఆపరేట్ చేసే విధానంలో మార్పు వస్తుందని, తద్వారా కంప్యూటర్ స్క్రీన్ పై కర్సర్ కదలికల్లో, దాని వేగంలో తేడాలు కొట్టొచ్చినట్లు కనపడతాయన్న విషయం ఆ అధ్యయనం ద్వారా తెలిసింది. యూజర్లు నిరాశకు గురైన సందర్భాల్లో మౌస్ ను స్ట్రెయిట్ గా లేదా వంకర్లు తిప్పుతూ ఎక్కువ సేపు కదిలించలేరని.. నెగెటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడైతే మౌస్ కదలికలు నెమ్మదిగా ఉంటాయన్న విషయాన్ని అమెరికాలోని బ్రిగామ్ యంగ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జెఫ్రీ జెంకిన్స్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News